పుష్ప.. ది రైజ్ కి మించి పుష్ప.. ది రూల్- డైరెక్టర్ సుకుమార్

-

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . ‘పుష్ప-2’ మూవీపై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ‘క్వాలిటీ, ఎమోషన్ పరంగా సీక్వెల్ అదిరిపోయేలా ఉంటాయి అని అన్నారు. అల్లు అర్జున్-ఫహాద్ ఫాసిల్ మధ్య యాక్షన్ సీన్స్ హైలైట్గా ఉండనున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు భావోద్వేగంతో పాటు థ్రిల్లింగ్ అనుభవాన్ని పంచుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.దీంతో అల్లు అర్జున్ మరోసారి ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news