అట్టహాసంగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆటగాళ్ళందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. కామన్వెల్త్ క్రీడల కోసం బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు బర్మింగ్‌హామ్ చేరుకోగానే నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. మిగతావారందరికీ నెగటివ్ రాగా, పీవీ సింధు ఫలితం మాత్రం కాస్త అటూఇటూగా వచ్చింది. ఫలితం అనుమానంగా ఉండడంతో రెండో టెస్టు ఫలితం వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలని సింధుకు సూచించారు అధికారులు.
ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్టు భారత అధికారులు కూడా తెలిపారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సింధుకు నెగటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కొవిడ్ సోకలేదని నిర్ధారణ అయ్యాక ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి అనుమతించారు. అయితే ఇప్పటికే కామన్వెల్త్‌లో ఇండియా తరుపున
పతాకాధికారిగా పీవీ సింధు ఎంపికైన విషయం తెలిసిందే.