ఫైనల్లో పీవీ సింధు ఓటమి

-

భారత షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మరిస్కా టుంజంగ్‌ చేతిలో 8-21 8-21 తేడాతో ఓడిపోయింది. ఈ టైటిల్ పోరులో సింధు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. సింధు ఆటతీరులో చురుకుదనం లోపించింది. దాంతో, ఇండోనేషియా షట్లర్ టుంజుంగ్ మరింత విజృంభించింది. సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు సింధు, టుంజుంగ్ ఏడుసార్లు పరస్పరం తలపడ్డారు. ఈ ఏడు పర్యాయాలూ సింధునే గెలిచింది. ఇవాళ ఫైనల్లోనూ సింధుదే విజయం అందరూ భావించారు. కానీ గత రికార్డును పట్టించుకోకుండా టుంజుంగ్ విజృంభించి ఆడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version