ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు…84 పరుగులు చేసిన తిలక్ వర్మ

-

ఐపీఎల్‌ 16 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. అయితే.. ఈమ్యాచ్‌లో తక్కువ స్కోరుకు పరిమితమవుతుందుని భావించిన ముంబయి ఇండియన్స్ అనూహ్యరీతిలో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అందుకు కారణం తెలుగుతేజం తిలక్ వర్మ అద్భుత పోరాటమే. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ మైదానంలో అన్నివైపులా బంతిని పరుగులు పెట్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 46 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ స్కోరులో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ హెలికాప్టర్ షాట్ తో సిక్స్ కొట్టిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు.

 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తిలక్ వర్మ, నేహాల్ వధేరా (13 బంతుల్లో 21 రన్స్) కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వధేరా అవుటైనప్పటికీ తిలక్ వర్మ పోరాటం ఆపలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ 2, సిరాజ్ 1, రీస్ టాప్లే 1, అకాశ్ దీప్ 1, హర్షల్ పటేల్ 1, బ్రేస్వెల్ 1 వికెట్ తీశారు. తిలక్ వర్మ హైదరాబాద్ రంజీ ఆటగాడు. ఐపీఎల్ లో గత సీజన్ లోనూ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version