బ్యాడ్మింటన్ సింగిల్స్ లో రజతం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా 2018 క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు విజయాన్ని సాధించలేకపోయింది. వరల్డ్ నంబర్ వన్ తైజు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్ లో ఓడిపోయింది. దీంతో ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఫైనల్స్ లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు యింగ్ కదిలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది. ఈ ఇద్దరు క్రీడాకారులు ఇప్పటి వరకు 13 సార్లు తలపడగా 10 సార్లు తైజుదే పై చేయి కావడం విశేషం. 1982 తర్వాత సింగిల్స్ లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి.