మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ వెండితెరపైన కనబడితే చాలు.. ప్రేక్షకులు ఆనందపడిపోతుంటారు. అంతటి అందాలు ఆమె సొంతం. ఈ సుందరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అఆ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ.
అందంతో పాటు అభినయం ఉన్న నటిగా అనుపమ మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు భాషతో పాటు మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ కుట్టి.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పట్టు చీరలో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
అవి చూసి నెటిజన్లు ‘ఐ లవ్ యూ, ప్రిన్సెస్, క్వీన్ ఆఫ్ టాలీవుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎరుపు రంగు రవిక, పట్టు చీర ధరించి కర్లీ హెయిర్ ముందేసుకుని అలా ఓర చూపులతో దిగిన ఫొటోలను షేర్ చేసిన అనుపమ.. ఈ ఫొటోలకు ‘చీర కట్టుకోవడం కళ’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
అలా నడుముపై చేయి వాల్చి, బుగ్గ మీద చేయి పెట్టుకుని, మెడ వంచి., అదరాలు చూపుతూ రకరకాల స్టిల్స్ ఇచ్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నది ఈ సుందరి.. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ చివరగా ‘రౌడీబాయ్స్’ ఫిల్మ్ లో కనిపించింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్ రెడ్డి ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ప్రజెంట్ ఈ భామ ‘కార్తీకేయ 2, 18 పేజెస్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.