తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎదురులేకుండా ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తోన్న విషయం వాస్తవం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ చుట్టూనే తిరిగేవి. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా తారుమారయింది. దీనికి కారణం ఏంటి అంటే రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం మరియు వారి ప్రజల కోసం పోరాటం చేయకపోవడం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని ప్రత్యేక వాదంతో పార్టీని స్థాపించి 13 ఏళ్లపాటు పోరాటం చేసిన టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు.
సరే వారిలోలో ఉన్న పోరాట భావాలను గుర్తించి తెలంగాణ ప్రజలు వారికి ఓటు వేశారు కానీ టిఆర్ఎస్ ను తిరుగు లేని శక్తి గా నిలబెట్టింది మాత్రం వారి సమగ్ర పాలనాతీరు మరియు ప్రతిపక్ష పార్టీల చేకానితనం. ఇదే సమయంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం వారి పార్టీలోని ప్రధాన నాయకులను కాపాడుకోలేక వారు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతుంటే చూస్తూ ఉండిపోయారు. ఎంతసేపటికీ అనవసరమైన విమర్శలు తప్పించి కేసీఆర్ పాలన పై ఎప్పుడూ సరైన పాయింట్ మాట్లాడలేదు ప్రతిపక్ష పార్టీలు.
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరిగితే పోరు ఏకపక్షం అవుతున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తమకు ఒక భవిష్యత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో అయితే లేరు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలపై ప్రశ్నించడం మరియు వారు చేసే తప్పులను ఎత్తి చూపడం వంటివి చేసేందుకు కూడా ఇప్పుడు వారికి ధైర్యం చాలట్లేదు. అసలు మన పార్టీలో వారితో పోరాడే శక్తి ఉందా అన్న ప్రశ్నకు వారి దగ్గర వారికే సమాధానం లేకపోవడం గమనార్హం.