సీఎం జగన్‌కు ఆర్‌.నారాయణమూర్తి ధన్యవాదాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులను ప్రకటించారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు కింద రూ.10లక్షల రుపాయల నగదు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు కింద రూ.5లక్షల నగదు అంద చేయనున్నారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించడం తెలిసిందే. కళాతపస్వి కె.విశ్వనాథ్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తిలకు జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించారు. దీనిపై ఆర్.నారాయణమూర్తి స్పందించారు. కె.విశ్వనాథ్ తో పాటు తనకు కూడా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషం కలిగించిందని అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు ఆర్.నారాయణమూర్తి. ప్రజల సమస్యలపై సినిమాలు తీస్తున్న తనను ప్రజలు పీపుల్స్ స్టార్ అని పిలుస్తుండడం ఆనందం కలిగించే విషయం అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. అర్ధరాత్రి స్వతంత్రం సినిమా నుంచి ప్రజా సమస్యలే అజెండాగా సినిమాలు తీస్తున్నానని ఆర్.నారాయణమూర్తి వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version