తాజాగా పీపుల్స్ లీడర్ ఆర్ నారాయణమూర్తి తన లేటెస్ట్ సినిమా గురించి విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈయన మాట్లాడుతూ .. నేను తీస్తున్న ఈ పేపర్ లీకేజుల గోలేంది అన్న సినిమా ఆగష్టు ఆఖరున విడుదల చేస్తున్నాను. నా కెరీర్ లో తీస్తున్న 31వ సినిమా యూనివర్సిటీ మీద తీయడం జరిగిందన్నారు. నేటి కాలంలో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసే పడేశారు ఈ కార్పోరేట్ మోసగాళ్లు అంటూ చదువు కొనాల్సిన పరిస్థితిని గురించి నారాయణమూర్తి వివరించారు. ఈ కాలంలో పరీక్షలు పిల్లలకు కాదు, వాస్తవంగా తల్లితండ్రులకు అంటూ బాధపడ్డారు నారాయణమూర్తి. మస్తుగా డబ్బున్న వారేమో పరీక్ష పేపర్ ను లీక్ చేయించుకుని మరీ దర్జాగా కాపీలు కొడుతుంటే.. డబ్బు లేనివారు కస్టపడి చదివినా ఉపయోగం లేక రోడ్డున పడుతున్నారన్నారు. నా సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు లక్ష్యం… విద్యను మరియు వైద్యాన్ని జాతీయం చేయాలనీ కేంద్రాన్ని కోరడమే అన్నారు నారాయణమూర్తి.
ఆర్ నారాయణమూర్తి: “ఈ పేపర్ లీకేజుల గోలేంది” … ప్రేక్షక దేవుళ్ళారా ఆదరించండి !
-