ఈ రోజు కోసం భారతదేశ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న విధంగానే ఇస్రో చంద్రయాన్ 3 ను భూమి కక్షలోకి సక్సెస్ ఫుల్ గా ప్రవేశ పెట్టింది. ఈ సంతోష సందర్భాన్ని పురస్కరించుకుని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాధ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ నిర్దేశించిన కక్షలోకి చంద్రయాన్ ఉపగ్రహం విజయవంతంగా చేరిందన్నారు. అయితే ఆ తర్వాత చంద్రయాన్ చంద్రుని వైపు చేరుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాము, అన్నీ సవ్యంగా జరిగాయి అంటూ పరస్పరం అధికారులు అంతా అభినందనలు తెలుపుకున్నారు. ఇక మెల్లగా కక్షను పెంచి చంద్రుని వైపు దూసుకువెళ్లేలా రన్ చేస్తాము అన్నారు. డాక్టర్ సోమనాధ్ అండ్ టీం చంద్రయాన్ 3 విషయంలో సక్సెస్ అయింది. ఈ విషయంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.