రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుంచి రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్..!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతొన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈ సినిమా అప్ డేట్ ఇవ్వడం లేదు డైరెక్టర్ శంకర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయింది.

ఈ సాంగ్  అద్భతంగా తెరకెక్కించారు. సాధారణంగా శంకర్ సినిమాలు అంటేనే సాంగ్ లకు ప్రత్యేకం అని చెప్పాలి. ఈ సినిమాకు సంగీతం థమన్ సమకూర్చుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాశాడు. ఈ పాట రాయడానికి దర్శకుడు శంకర్ చెప్పిన విధానమేనని నిన్న రచయిత చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news