నగ్నంగా నటించమంటే ఎలా? : రాధికా ఆప్టే

-

రాధికా ఆప్టే… పాప ఎం మాట్లాడినా సరే ఒక సంచలనం. చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా వార్తల్లో ఉండటం ఆమె స్టైల్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ భామ. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు కూడా ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంది. తాజాగా ఆమె మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. శృంగారం కోసం సినిమాల్లోకి రాలేదని చెప్పింది.

అహల్య `బద్లాపూర్` వంటి చిత్రాల్లో ఆమె నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన నేపధ్యంలో ఇక ఆమె అలాంటి పాత్రలు చేస్తుంది అనుకుని ఆమెను సంప్రదించారు కొందరు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ… తెర మీద నగ్నంగా, శృంగారభరిత సన్నివేశాల్లో కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదన్న ఆమె… సీన్ డిమాండ్ చేస్తే నేను సిద్ధమే అని చెప్పింది.

చాలా మంది దర్శకులు నన్ను అలాంటి పాత్రల కోసమే సంప్రదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా? కేవలం సెక్స్ చేయడం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదని స్పష్టం చేసింది. డ్రెస్సింగ్ విషయంలో తనకు దీపికా పదుకొణే, కంగన రనౌత్ స్టైల్ అంటే ఇష్టం అని చెప్పింది ఆమె. కాగా తెలుగులో ఆమె లెజెండ్ సినిమాలో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version