రబీ సాగు.. నిజాం సాగర్ నుంచి నీటి విడుదల : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

రాష్ట్రంలో రబీ సాగుకు నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ వెంట మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంత్ రావు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సైతం పాల్గొన్నారు.

నీటి విడుదల అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని వివరించారు. వందేళ్ల చరిత్ర గల ప్రాజెక్టు నిజాం సాగర్ అని.. ఇది నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. రైతులు పొదుపుతో నీటిని వాడుకోవాలని, ఆన్ ఆఫ్ మోడ్‌లో సాగు నీళ్లను అందిస్తామని తెలిపారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి వారికి హామీ ఇచ్చారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news