ఒకసారి ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్స్

-

ఈ మధ్యకాలంలో కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లపై మక్కువ ఎక్కువ చూపుతున్నారు. అందుకోసం కార్ల తయారీ కంపెనీలు అత్యధిక మైలేజీని ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 500 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే కార్లు వేళ్ళ మీద లెక్కపెట్టే మాదిరిగానే ఉన్నాయి. వాటిల్లో కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం.

కియా ఈవీ సిక్స్:

కియా నుండి విడుదలైన ఈవీ సిక్స్ అనే ఎలక్ట్రిక్ కారు 77.4 కిలో వాట్ లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్యం కలిగి.. 350 nm, 605 nm టార్క్ ని విడుదల చేస్తుంది. దీని ఛార్జింగ్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది 10 నుంచి 80% వరకు కేవలం 18 నిమిషాల్లో 350 కిలో వాట్ చార్జర్ ని ఉపయోగించుకుని ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. దీని ధర 60. 96(ఎక్స్ షోరూమ్) లక్షలు గా ఉంది.

మహీంద్రా BE6:

దీనిలో 79 కిలోవాట్ సామర్థ్యం గల ఎల్ ఎఫ్ పి బ్యాటరీ ఉంది. 20 నుంచి 80% వరకు కేవలం 20 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. దీన్ని చార్జ్ చేయడానికి 175 కిలో వాట్ చార్జర్ అవసరం. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. దీని ధర 18.90 లక్షలు(ఎక్స్ షోరూమ్) గా ఉంది.

బీఎండబ్ల్యూ 17:

101.7 కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యం గల ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 603 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. కేవలం 5.5 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని ఎత్తుకుంటుంది. మార్కెట్లో దీని ధర 2.03 కోట్లుగా(ఎక్స్ షోరూమ్) ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news