ఈ ఏడాది 42 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి : రాచకొండ కమిషనర్

-

ఈ ఏడాది 253 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, 521 మంది నిందితులను అరెస్టు చేశాము. 88 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశాము అని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిలో 165 మందికి హిస్టరీ షీడ్స్ ఓపెన్ చేశాము. ఈ ఏడాది 30 మంది నిందితులకు జీవిత ఖైదు పడేలా చేశాము. దేశంలోనే మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉంది. లోక్‌ అధాలత్‌లో 11 వేలకు పైగా కేసులను పరిష్కరించాము. ఏడాది రెండు లక్షల 41 వేల 742 డయల్‌ 100కు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ అయ్యాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక ఫోన్‌ కాల్ అటెంప్ట్ చేశాము.

సైబర్ క్రైమ్ లో బాధితులకు 22 కోట్ల రూపాయల నగదను రీఫండ్ చేశాము. కమిషనరేట్ పరిధిలో జరిగిన 73 హత్య కేసులను చేధించాము. ఏడాది రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన చిన్న పిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసును చేధించి 15 మంది పిల్లలను రిస్క్యూ చేశాము. ఈ ఏడాది 42 శాతంకు పైగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 53 మందికి పైగా సైబర్ క్రైమ్ నేరస్తులను అరెస్టు చేశాము. ఏడాది 15,62 కేసులో నమోదయ్యాయి. 2600 కు పైగా డ్రైవింగ్ లైసన్స్ లు రద్దు చేశాము అని రాచకొండ కమిషనర్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news