అల్లు అర్జున్ కేసు వ్యవహారం నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు “గేమ్ చేంజర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్నారని.. ఆయన హైదరాబాద్ కు వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని వెల్లడించారు.
టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై మరోసారి చర్చిస్తామని అన్నారు. అంతేకాదు.. సంక్రాంతి వేళ విడుదలయ్యే సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని.. విడుదల రోజునే తెల్లవారుజామున 4:30 గంటలకు సినిమా పడితే చాలని అన్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ వేదికగా తెలంగాణ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.