థియేటర్లలో “రాధే శ్యామ్” మానియా.. తొలిరోజు సాలీడ్ కలెక్షన్స్

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టించింది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా నిన్న థియేటర్లలో విడుదల అయింది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 7000 కు పైగా స్క్రీన్స్‌ లో విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాయి.

ప్రభాస్‌ కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్‌ లైన్‌ టికెట్స్‌ బాగా అమ్ముడయ్యాయి. యూఎస్‌ ప్రీమియర్‌ షోస్‌ ద్వార 891k డాలర్స్‌ వచ్చాయని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే.. దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఒక్క హైదరాబాద్‌ సిటీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ గ్రాస్‌ 6.5 కోట్ల మార్కును క్రాస్‌ చేసింది. ఇక పోతే… ప్రపంచ వ్యాప్తంగా 202.80 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది రాధే శ్యామ్‌ మూవీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version