ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా మరింత దూకుడగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న రష్యా బలగాలు చూపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పడింది. తాజా గా కీవ్ నగరం నలు మూలల నుంచి రష్యా బలగాలు ఎంట్రీ ఇచ్చాయి. భారీ స్థాయిలో కాల్పులు చేస్తు.. రష్యా బలగాలు కీవ్ నగరంలోకి దూసుకెళ్తున్నాయి. కాగ భారత కాలమానం ప్రకారం.. శుక్ర వారం రాత్రి సమయం లోనే కీవ్ నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించాయని తెలుస్తుంది.
కాగ రష్యా బలగాలకు అడ్డు వస్తున్న ఉక్రెయిన్ సైన్యం, పౌరులపై కాల్పులు జరుపుతూ ముందుకు సాగుతున్నాయని సమాచారం. రష్యా బలగాలు ఇదే స్పీడ్ లో ముందుకు వెళ్తే మరి కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా హస్తగతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. కాగ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం దాదాపు 15 రోజులు దాటి పోవస్తుంది. అయినా.. చర్చలు కోలక్కి రాలేదు. ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఆగడం లేదు.