బీజీపీ ఎంపీ గా రాధిక.. పోటీ ఎక్కడ నుండంటే..?

-

నటి రాధిక గురించి కొత్తగా చెప్పక్కర్లేదు రాధిక మనందరికీ ఈ సినిమాల ద్వారా పరిచయమే. తమిళనాడులో బిజెపి పోటీ చేస్తున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా వివరాలని విడుదల చేశారు. జాతీయస్థాయిలో బిజెపి మూడవదశ అభ్యర్థులు జాబితా నిన్న ప్రచురించగా ఇందులో తమిళనాడులో బిజెపి మిత్రపక్ష పార్టీలు పోటీ చేసే తొమ్మిది నియోజక వర్గాలు ఉన్నాయి. లిస్టు ప్రకారం చూసినట్లయితే దక్షిణ చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో జాతీయ స్థాయి బిజెపి నాలుగవ దశ జాబితాని విడుదల చేశారు అయితే ఈ వివరాల ప్రకారం నటి రాధికని విరుదునగర్ నియోజకవర్గంలో పోటీకి చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ముందు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బిజెపి జిల్లా కార్యదర్శి పాండురంగన్ సోదరుడు జవహర్ జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ రామ శ్రీనివాస్ ఢిల్లీలో పని చేస్తున్న డాక్టర్ వేద దామోదర్ లని అభ్యర్థులుగా భావించారు. కనుక ఇప్పుడు రాధిక పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. విరుదునగర్ నియోజకవర్గాన్ని బిజెపి నేరుగా పోటీ చేస్తుందా లేదంటే పొత్తు కి కేటాయిస్తుంది అనేది అనే పరిస్థితి కూడా ఏర్పడింది ఎట్టకేలకు రాధిక పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news