Video Viral : వెల్లూర్‌ CMC కాలేజీలో ర్యాగింగ్.. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్

-

తమిళనాడులోని వెల్లూర్ లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ)లో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. కొందరు విద్యార్థులు తోటివారిని ర్యాగింగ్ చేస్తున్న వీడియో అదే కాలేజీకి చెందిన విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెన్స్‌ హాస్టల్‌ క్యాంపస్‌లో జూనియర్లను సీనియర్లు దుస్తులు విప్పించి లోదుస్తులపై క్యాట్ వాక్ చేయించారు. పైపులతో నీళ్లు చల్లుతూ, కర్రలు, బెల్టుతో కొడుతూ ఎంజాయ్‌ చేశారు.

అంతటితో ఆగకుండా.. అక్కడే ఉన్న ఓ బురద గుంటలో పడుకోవాలని, ఒకరినొకరు రుద్దుకోవాలని ఆజ్ఞాపించి వికృతంగా ప్రవర్తించారు. ఈ ర్యాగింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ప్రాథమిక విచారణ జరిపి.. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ విషయాన్ని సీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్ సాల్మన్‌ సతీష్‌ కుమార్  తెలిపారు.

ర్యాగింగ్‌ జరిగిన విషయాన్ని తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. కళాశాల యాజమాన్యం విచారణ కమిటీని నియమించి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు విద్యార్థులను బాధ్యులుగా తేల్చారు. వారిని కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version