ఇదంతా ఫేక్ న్యూస్: రాఘవ లారెన్స్

-

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి-2 తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ కు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన లారెన్స్ ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు. ప్రధానపాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఫీమేల్ లీడ్ విషయమై క్లారిటీ ఇస్తుంది. అప్పుడు మేము అధికారికంగా ప్రకటిస్తాము.. అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version