నిన్న సబ్ ఆర్డినేట్ ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు రఘురామకృష్ణంరాజు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసి సబ్ ఆర్డినేట్ ఆఫ్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి కాలం ముగిసిందని, అది తెలియని ప్రభుత్వ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నదని అన్నారు. మూడు నెలల క్రితమే ఆ పదవి నుంచి నన్ను తొలగించాలని స్పీకర్ కు లేఖ ఇచ్చారని అన్నారు. అది సంవత్సరం పదవి కాలం అని, మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారని ఆయన అన్నారు.
నా పదవి కాలం అయిపోయింది కాబట్టి, దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని పార్టీ ప్రభుత్వం లెటర్ ఇచ్చిందని రాజు అన్నారు. రెడ్లకు పదవులు ఇవ్వడం అయిపోయింది కాబట్టి, ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారని అలా బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారని ఆయన అన్నారు. త్వరలో నాపై అనర్హత వేటు వేయిస్తామని పిచ్చి రాతలు రాయిస్తున్నారని, నన్ను ఎవరూ తొలగించలేరని అన్నారు. అలా అంటున్న వారికి సవాల్ విసురుతున్నా, సీఎం జగన్ కు కూడా సవాల్ విసురుతున్నా అమరావతిపై రెఫరెండం పెడితే, రెండులక్షల ఓట్లు తేడాతో గెలుస్తాను.. సియం జగన్ నిలుచున్నా సరే అని ఆయన అన్నారు. ఇది అతిశయోక్తితో చెబుతున్నది కాదన్న ఆయన ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.