రఘు ‘వీరా’ లెవల్ వాగ్దానం…సర్వత్రా చర్చనీయాంశం…

-

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా  రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 11న అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా.. మీడియా సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ..  రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టబోనని వాగ్దానం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిన పార్టీ నేతలు మనకు వాగ్దానాలు కలిసి రావడం లేదంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతాం. అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఏపీలో అడుగుపెట్టను. నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నా’ అని రఘువీరా అన్నారు. అయితే ఏపీపై ఉన్న ప్రేమతో ప్రత్యేక హోదా సాధించాలనుకోవడంలో తప్పులేదు.. కానీ తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీసేది లేదు అంటూ వాగ్దానం చేసి …ఆయన రోజురోజు గడ్డం పెంచుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ… పలువురు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అక్కడక్కడ మనుగడ సాగిస్తున్న భాజపా వారి కంటే కూడా రఘువీరా నూటికి నూరు శాతం మెరుగని ఆయనకు సర్టిఫికేట్ సైతం ఇస్తున్నారు.   ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు.

ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా ఏపీకి హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత అధికారం చేపట్టిన భాజపా హోదా కాదు కదా…కనీసం రైల్వే జోన్ ఏర్పాటు చేయలేని దుర్భరమైన స్థితిలో ఉంది. గుడ్డిలో మెల్ల లాగా భాజపా కంటే కాంగ్రెస్ నయం అనే విధంగా ఏపీ ప్రజల ఆలోచన దోరణిలోనూ మార్పు రావడం హర్షించదగ్గ విషయం. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. ఏపీ హోదా అంశంపై మరోసారి స్పందించారు. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిసిన సందర్భంగా.. లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే తాము చేసే మొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమేనని చెప్పారు. ‘రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్యమైన హామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోదీకి అర్థమయ్యేలా చెప్పాలి. దీంతో కాంగ్రెస్ చేస్తా అనే  హామీ ఇస్తే ఖచ్చితంగా చేస్తుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version