త్వరలోనే పొత్తుల గురించి తేలిపోతుందని మూడు పార్టీల మధ్య పొత్తుతో కూటమి విజయాన్ని సాధిస్తుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కుల వ్యవస్థ అన్నది ప్రస్తుత సమాజానికి అవసరం లేదని కులాలవారీగా చలామణి అయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత నాలుగువేల క్రితం పాలకపక్షంలో ప్రతిపక్షంగా నేనొక్కడినే ఇప్పుడు ఎంతోమంది తనతో పాటు ఉన్నారని అన్నారు శ్రీకృష్ణదేవరాయలతో పాటుగా మాగుంట కూడా బయటకి వచ్చారని అన్నారు.
సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టిన పాలకులు రేపు మన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉందన్నారు, సచివాలయాన్ని 350 కోట్ల రూపాయలకి తాకెట్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు టూరిజం ప్రాజెక్ట్ 500 కోట్ల ని వెచ్చించి విశాఖపట్నం రిషికొండ మీద విలాసంతమైన ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారని దీంతో ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచాలని, ఎవరిని ఇంటికి పంపించాలన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఎన్నికల తర్వాత ఓదార్పు యాత్రలో 2.0 ఖచ్చితంగా కార్యకర్తల కోసం చేయాలని అన్నారు.