బిగ్ బ్రేకింగ్: హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణం రాజు!

-

వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అసలు ఆయన సమస్య ఏమిటో అర్ధం కావడంలేదని నియోజకవర్గ ప్రజలు చెవులుకొరుక్కుంటున్న దశలో.. ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రఘురామ కృష్ణరాజుపై ఆ పార్టీ ఎంపీలు అనర్హత పిటిషన్‌ను లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించేందుకు వెళుతుండగా.. మరోపక్క ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని.. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌ పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌ పై షోకాజ్ నోటీసు ఇచ్చారని చెబుతున్న రఘురామ కృష్ణరాజు… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదని, కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version