ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ జీవో ఇచ్చారని దాని ద్వారా అవ్వాతాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణం రాజు తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవలే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఓ జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు పెట్టాలంటూ లేఖ రాసిన ఎంపీ, ఇప్పుడు ఫించన్ విషయంలో మరో లేఖ రాయటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.