సీఎం జగన్ సరికొత్త రికార్డ్…! 10 లక్షల టెస్టులు…5 కోట్ల ఆశీర్వాదాలు..!

-

ap cm jagan mohan reddy
ap cm jagan mohan reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నివారణ చర్యల్లో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారు. సమర్ధుడు చైతన్యవంతుడు అని నిరూపించుకుంటున్నాడు. రాష్ట్రంలో కరోనా కేసులు భీకరంగా విజృంభిస్తుంటే సీఎం జగన్ మాత్రం అస్సలు బెదరడం లేదు. కరోనాను రాష్ట్రం నుండి తరిమికొడుతున్నాడు. ఆంధ్రాలో ప్రతీ లక్ష మందికి 14 వేల మందిని టెస్ట్ చేసిన ఘనత పొందిన సీఎం జగన్ నేడు మరో ఘనత సాధించాడు. రాష్ట్రంలో నేటితో 10 లక్షల టెస్టుల మార్క్ ను సమర్ధవంతంగా పూర్తి చేశాడు.

ఏపీలో 10,17,140 టెస్టులు చేసి దేశానికే స్ఫూర్తిగా నిలబడ్డాడు. దాదాపుగా ఐదున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో జగన్ ఇప్పటికే 10 లక్షల కేసులు చేయడం నిజంగా అభినందనీయం. కరోనా టెస్టులు ప్రారంభించి ఇప్పటికే 59 రోజులు అవుతుండగా మొదటి 5 లక్షల టెస్టులు చేసేందుకు 41 రోజులు పట్టింది మరో 5 లక్షల టెస్టులు పూర్తి చేసేందుకు కేవలం 24 రోజులు పట్టింది. విస్తృతంగా టెస్టులు జరుపుతూ రాష్ట్రాన్ని మహమ్మారి బారిన నుండి దాని సంక్రమణ నుండి ప్రజలను రక్షిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version