రాజు గారి సర్వే..మరో లగడపాటి లెక్క!

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..అధికార వైసీపీపై ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టడం..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం. అలాగే ఈయన టీడీపీ-జనసేన పార్టీలకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పార్టీల పొత్తులో తాను పోటీ చేస్తానని చెబుతున్న విషయం తెలిసిందే. ఇక రఘురామ కోరుకున్నట్లే టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.

అయితే ఈయన సర్వేలు కూడా చేయిస్తున్న విషయం తెలిసిందే.ఆ మధ్య సర్వే చేయించానని చెప్పి ఓ రిపోర్టుని చెప్పారు. ఆ సర్వేలో టీడీపీ ఎడ్జ్ లో ఉందని, 95 సీట్లు వరకు గెలుచుకుంటుందని చెప్పారు. తాజాగా టీడీపీ-జనసేన పొత్తుపై సర్వే చేశారట దానికి సంబంధించిన రిపోర్టు మీడియా ముందు చెప్పారు.  వైసీపీ వై నాట్ 175 అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. కలలో కూడా అది జరిగే అవకాశమే లేదని,  టీడీపీకి అనూహ్య ఆదరణ లభించడం ఆశ్చర్యకర పరిణామమని.. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎలా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందో అర్థం కావడం లేదన్నారు.

ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే, తమ పార్టీకి దారుణమైన పరాభవం తప్పేలా లేదని అన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో దాదాపు రాష్ట్రంలో 12-14 శాతం ఎక్కువ మెజార్టీ సాధిస్తాయని చెప్పారు. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలో 10-12 శాతం టీడీపీ, జనసేనలకు ఎడ్జ్ ఉంటే.. ఉభయగోదావరి జిల్లాలలో 14-16 శాతం.. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12-14 శాతం.. ఒంగోలు- నెల్లూరులలో 8-10. అనంతపురం, కర్నూలులలో 10-12, కడప-చిత్తూరులలో 6-8 టీడీపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉందని తెలిపారు.

అంటే ఈయన సర్వే టీడీపీ-జనసేనకు పూర్తిగా అనుకూలంగా ఉంది. అయితే గతంలో లగడపాటి రాజగోపాల్ కూడా ఇలాగే సర్వేలు చేస్తే ఏమైందో తెలుసని, ఇప్పుడు రాజుగారి సర్వేలు అంతే అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version