ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తన తండ్రిపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజమండ్రి ఎంపీ భరత్ గారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కోరడమే నేరమైతే, దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారిపై పడిన నిందను భరించలేకపోవడమే అభిమానులుగా తమ నేరమైతే పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయాలన్నారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం రాజమండ్రి ఎంపీ భరత్ ఒక ఛానల్ డిబెట్లో మాట్లాడుతూ అమ్మా బాబుకు పుట్టిన వారెవరు ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలో చేరరని చేసిన వ్యాఖ్యలు, చివరకు మా పార్టీకే తగిలాయని, టీడీపీ తరఫున గెలిచి, తమ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను ఆ మాట ఆయన అన్నారని ఒక వర్గం అంటూ ఉంటే, 1978లో రెడ్డి కాంగ్రెస్ తరపున ఆవు దూడ గుర్తుపై వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు గెలిచిన కొద్ది రోజులకే అప్రహతిత విజయం సాధించిన ఇందిరా కాంగ్రెస్ లో చేరారని అన్నారు.