దేవుళ్లకు గుడులు కట్టడం సర్వసాధారణమైన విషయమే. ఇదే సమయంలో తమిళనాట, మరికొన్ని చోట్ల సినీతారలకు కూడా టెంపుల్స్ కట్టిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మొహన్ రెడ్డికి గుడికడుతున్నారు. ఏపీలో జగన్ కు సంబందించిన ఏ విషయంపై అయినా తనదైన కామెంట్లు చేసే రఘురామకృష్ణంరాజు… ఈ విషయంపై స్పందించారు!
అవును… పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం మండంలం, రాజుపాలెం గ్రామంలోలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. దీంతో మైకులముందుకు వచ్చిన రెబల్ ఎంపీ ఆర్.ఆర్.ఆర్… తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫీలవుతున్నారు! జగన్ కు గుడికట్టడం అనేది ఆయన అభిమానుల వ్యక్తిగత విషయంగా భావించే ఆలోచన చేయని ఆర్.ఆర్.ఆర్…. హిందువుల మనోభావాలకు కూడా ముడిపెట్టేస్తున్నారు!
ఏపీలో రాజకీయంగా తన మనుగడకాపాడుకోవడానికి… గతకొంతకాలంగా హిందువుల గొంతుక తానే అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు.. అన్న కామెంట్ ను సొంతం చేసుకున్న రఘురామకృష్ణం రాజు… జగన్ కు గుడి కట్టడాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. జగన్ కు చర్చి కట్టుకోండి, మసీదు కట్టుకోండి కానీ… హిందు దేవుళ్లకు మాత్రమే కట్టే “గుడి” ని కట్టొద్దని లాజిక్ లాగుతున్నారు.
క్రైస్తవుల చర్చిల్లో జీసస్ మాత్రమే ఉండాలా… కానీ గుడిలో మాత్రం జగన్ విగ్రహం పెడతారా అనేది ఆయన “లాజిక్”. దీన్ని ఆయన అవివేకంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు! ఇక్కడ జగన్ కు చర్చి కడుతున్నారా.. మసీదు కడుతున్నారా.. గుడి కడుతున్నారా అన్నది పాయింట్ కాదు… ఆయనకు దేవుడికి ఇచ్చేటంత విలువ ఇస్తున్నారన్నది “పాయింట్”. ఈ విషయం తెలియకో.. తెలిసినా కూడా తాను ఎంతో ప్రేమించే ముఖ్యమంత్రిని ప్రజలు కూడా ఎక్కువగా ప్రేమించేస్తున్నారనే స్వార్ధంతోనో కానీ… “పాయింట్” ని వదిలేసి “లాజిక్” ని లాగుతున్నారు ఆర్.ఆర్.ఆర్.!!