వైరల్ వీడియో: ఖరీదైన మద్యం రోడ్డు మీద ఫ్రీగా దొరికింది…!

-

రోడ్డుపై మద్యం దొరికితే…? పండగే కదా…? కొనాలి అంటే నానా కష్టం గాని ఫ్రీ గా రోడ్డు మీద మద్యం దొరికితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా…? ఇలాంటి ఘటనే ఒకటి చత్తీస్‌ఘడ్   లో వెలుగులోకి వచ్చింది. అసలు ఆ ఘటన ఏంటీ అనేది ఒకసారి చూస్తే… రాష్ట్రంలోని కవార్దాలో నిన్న ట్రక్కు బోల్తా పడింది. అది మద్యం ట్రక్ అనే విషయం స్థానికులకు సమాచారం అందింది.

వెంటనే అక్కడికి పరుగులు తీసారు. అలా ట్రక్ పడిందో లేదో గాని వెంటనే అక్కడికి వెళ్లి మద్యం బాటిళ్ళు దోచుకుని వెళ్ళారు. ఖరీదైన మద్యం సీసాలు వారికి దొరికాయి. దీనిపై మాట్లాడిన ఒక అధికారి… ట్రక్ లో రూ .20 లక్షల విలువైన 200 డబ్బాల ఆల్కహాల్ బాటిళ్ల వరకు ఉన్నాయి అని చెప్పారు. ఎంత నష్టం జరిగింది అనేది తాము అంచనా వేయలేదు అని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఉన్నా సరే మద్యం బాటిళ్ళు తీసుకుని వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version