రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తాం : రాహుల్‌

-

ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన సోదరి ప్రియాంక గాంధీ అనారోగ్యం దృష్ట్యా తాను వచ్చానని చెప్పారు. మనది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధమన్నారు. పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదన్నారు. పైగా తమ ప్రభుత్వం వస్తే రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌కు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ – బీజేపీ – ఎంఐఎం ఒకే తానుముక్కలుగా పని చేస్తున్నాయి. లోక్ సభలో ఏ బిల్లు వచ్చినా బీజేపీకి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దేశంలో విపక్ష ముఖ్యమంత్రుల మీద ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. అదే తెలంగాణలో మాత్రం ఏ ఈడీ, విజిలెన్స్, సీబీఐ దాడులు ఏమీ ఉండవు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. మీరు ఎంఐఎంకి ఓటేసినా, బీఆర్ఎస్‌ ఓటేసినా వేస్ట్. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్ఎస్‌కి ఓటేసినట్లే. ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ఈ రోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి. మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు. కుటుంబ బంధం. చరిత్రలో ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. మీరందరూ తెలంగాణ కోసం పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మంజూరు చేశారు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version