ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో అస్సలు పార్టీ పరిస్థితి ఏమిటి ? ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది తెలుసుకోవడానికి వచ్చారు. ఈ సందర్బంగా ప్రజలతో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మీరు BRS కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. నవంబర్ 30న ఎన్నికలు జరగబోయేది కేవలం కాంగ్రెస్ మరియు BRS ల మధ్యన మాత్రమే అన్నది ప్రజలు గుర్తుంచుకోండి అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. ఎలాగు తెలంగాణాలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని తెలిసిందే… అందుకే BRS ను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది..వీరికి తోడు
MIM పార్టీ కూడా కేసీఆర్ కు మద్దతుగా ఉంది..
అలా మొత్తం మూడు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారణి దక్కించుకోవడానికి చూస్తున్నారు. మీరు వీరి కుట్రను గమనించి తెలంగాణను మీకిచ్చిన సోనియాగాంధీకి గౌరవంగా అధికారాన్ని ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు.