తెలంగాణలో ధాన్యం కొనుగోలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వట్టర్ లో విమర్శించారు. ఈ విమర్శలకు టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మీరు ఎంపీగా ఉన్నారు… రాజకీయ లబ్ధికోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదని… ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని ఆమె అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రతీ రోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని.. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసస తెలియజేయండి… ఒక దేశం ఒక సేకరణ విధానం కోసం కాంగ్రెస్ డిమాండ్ చేయండి అని కవిత ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. taధాన్యం కొనుగోలు వ్యవహారంపై రాహుల్ గాంధీ తెలుగులో ట్విట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజా కొనే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని ఆయన ట్విట్ చేశారు.