చైనా ఆక్రమణకు మోదీ పిరికితనమే కారణం : రాహుల్

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మరోమారు తన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. తూర్పు లద్దాఖ్​ ప్రతిష్టంభనపై దేశానికి మోదీ అబద్ధం చెప్పారని ఆరోపించారు. ప్రధాని పిరికితనమే.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకునేలా చేసిందని మండిపడ్డారు.

rahul-gandhi

భారత సైన్యం శక్తిసామర్థ్యాలు, శౌర్యంపై ప్రధానికి తప్ప ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ఆయన అధైర్యం వల్లే మన భూమిని చైనా ఆక్రమించుకోగలిగింది. ఆయన అబద్ధాలు చెప్పడం చైనాకే లాభం. ఆక్రమించుకున్న భూములను చైనా ఉంచుకోగలదు అని రాహుల్ గాంధీ అన్నారు.సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి కేంద్రాన్ని ఒత్తిడిలోకి తోసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్​. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్​ నేతలు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాహుల్​ గాంధీ కూడా అనేకమార్లు కేంద్రంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.సరిహద్దు వివాదంతో పాటు కరోనా సంక్షోభంపైనా మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది కాంగ్రెస్​. వైరస్​ కట్టడిలో కేంద్రం దారుణంగా విఫలమైందని.. లాక్​డౌన్​తో నష్టపోయిన పేదలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్​ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version