మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడుతోందని… చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.నేను ఆయన్ని కలిశాను. ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షించడం వల్ల.. రికవరీ అవుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్య సూచీలన్నీ బాగున్నాయి. తొందరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాను అని ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు.
అయితే ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇందుకు భిన్నంగా బులెటిన్ విడుదల చేశారు. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. కీలక ఆరోగ్య సూచీలన్నీ స్థిరంగా ఉన్నాయి. వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు’ అని తెలిపారు.ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి.
Yesterday , I had visited my Father In Hospital . With God’s grace & all your good wishes , He is much better & stable than D preceeding days! All his vital parameters are stable & he is responding to treatment ! We firmly believe that He will be back among us soon
Thank You🙏— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 16, 2020