రాహుల్ యాత్ర..తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి!

-

ఏ విషయంలోనైనా పెద్ద రచ్చ చేయడం కాంగ్రెస్ నేతలకు బాగా అలవాటు అయిపోయింది. పాజిటివ్ కావొచ్చు..నెగిటివ్ కావొచ్చు. ఏదైనా సరే దానిలో రచ్చ చేయనిదే నాయకులు నిద్రపోవడం లేదు. ప్రతి అంశాన్ని సాగదీసి దానిపై ఏదొక వివాదం చెలరేగేలా చేయడం నేతలకు అలవాటు అయిపోయింది. ఇప్పటికే పలు అంశాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణకు ఊపు తెచ్చే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా రచ్చ నడుస్తోంది.

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో పాదయాత్ర మొదలుపెట్టిన రాహుల్…త్వరలో తెలంగాణలో కూడా పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి…నేరుగా తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర ఎంటర్ కానుంది. మక్తల్, నారాయణ పేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్, సదాశివ పేట్, మదూర్ మీదుగా మహారాష్ట్ర లోకి ఎంటరవుతుంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేయాలని ఇప్పటికే టీ పీసీసీ భారత్ జోడో యాత్ర కమిటీని కోరింది.

కనీసం 7 పార్లమెంట్, 15 అసెంబ్లీ సెగ్మెంట్ ల మీదుగా పాదయాత్ర సాగేలా చూడాలని హై కమాండ్‌ను కోరింది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోపు జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఓఆర్ఆర్ మీదుగా సాగే యాత్రతో పెద్దగా ఉపయోగం ఉండదంటున్న ఆయన… శంషాబాద్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి, సంగారెడ్డి మీదుగా రాహుల్ పాదయాత్ర సాగేలా మార్పులు చేయాలని అంటున్నారు. జగ్గారెడ్డి మాత్రమే కాదు…ఒక్కొక్కరు ఒకో విధంగా పాదయాత్ర షెడ్యూల్ మార్పులు చెబుతున్నారు.

దీని వల్ల కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. అయితే పి‌సి‌సి చెప్పిన మార్పులు బట్టి ఏ‌ఐ‌సి‌సి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరు ఏం చెప్పినా ఏ‌ఐ‌సి‌సి నిర్ణయమే ఫైనల్. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నేతలు దీనిపై కూడా విభేదాలు వచ్చేలా చేస్తున్నారు. మరి రాహూల్ పాదయాత్ర తెలంగాణలో ఏ విధంగా సాగుతుందో చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version