జమిలీ ఎన్నికల సాధ్య, సాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండి పడింది కాంగ్రెస్ పార్టీ.
వన్ నేషన్-వన్ ఎలక్షన్స్ భారత్ ఐక్యత అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ పేర్కొన్నారు. భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల సమైక్యత అని అన్నారు. జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియనే అని.. దీనిని ఏర్పాటు చేసిన సమయంపై పలు అనుమానాలు అన్నాయని తెలిపారు. నియమ, నిబంధనలను చూసినట్టయితే కమిటి సిఫారసులను ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.