రాహుల్‌ సిప్లిగంజ్‌ చేసిన పనికి ఎవరైనా క్లాప్స్ కొడతారు.!

-

ఈ సృష్టి లో అమ్మ ప్రేమ, ఆప్యాయత ముందు దేవుళ్ళు కూడా దిగదుడుపే అని అంటారు. అంతలా అమ్మ అందరి మనుసుల్లో నాటుకుని పోయింది. ఈ విషయాన్ని కొంత మంది బయటకి చెప్పుకుంటారు. మరి కొంత మంది చెప్పుకోలేరు. కొంత మంది మాత్రం వారి మనసులో భావాన్ని భలేగా చెబుతారు. ఇదంతా బిగ్ బాస్ షో విన్నర్ అయిన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ గురించి.

ఇక బిగ్‌బాస్‌కు ముందు రాహుల్‌ సిప్లిగంజ్‌ అంటే చాలా కొద్దిమందికే తెలుసు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచాడో అతని రేంజ్ మారిపోయింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే కొత్త ఇంటిని కొనాలన్న కోరికను బయటపెట్టిన రాహుల్‌ అనుకున్నట్లే లగ్జరీ సదుపాయాలతో కూడిన కొత్త ఇంటిని కొన్నాడు.తాజాగా డైరెక్టర్ రాజమౌళి దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి రాహుల్‌ ఇంటికి వెళ్లారు.

అక్కడ ఉన్న గోడలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ రాహుల్ తన తల్లి ఫొటోలతో నింపి తల్లిపై అపారమైన ప్రేమ ను చాటుకున్నాడు. ఇది చూసి వారు అమ్మపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌ను మనసారా అభినందించారు. కాగా ఈ సందర్భంగా రాజమౌళి ఫ్యామిలీతో కలిసి ఒక ఫొటో కూడా దిగాడు రాహుల్‌. బ్యాక్‌గ్రౌండ్‌లో తన తల్లి ఫొటోలతో నింపిన గోడలు కనిపించేలా దిగిన ఈ ఫొటో  ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతైనా రాహుల్ సిప్లిగంజ్ సూపర్ కదూ..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version