వాస్తు: పర్సులో డబ్బులు ఫుల్ గా ఉండాలంటే… ఈ తప్పులని చెయ్యద్దు..!

-

మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధా లేకుండా ఆనందంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకోవడం లాంటివి చేస్తే చాలా మేలు కలుగుతుంది. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే తొలగించడం మంచిది.

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరించకపోతే ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని వాస్తు ని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ఆదాయానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ధన నష్టం కలగకుండా ఉండాలన్నా జేబులో డబ్బులు తరిగిపోకుండా ఉండాలన్నా ఈ చిట్కాలు పాటించడం మంచిది. వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఉపయోగించే పర్సు ఎప్పుడు చిరిగిపోకుండా ఉండాలి. చిరిగిన పర్సులని ఉపయోగించడం వలన ధన నష్టం కలుగుతుంది. అలానే మీ దగ్గర డబ్బులు నిలకడగా ఉండవు. కాబట్టి మంచి పర్సు ని ఉంచుకోండి. చిరిగిన పర్సు ని ఉపయోగించకండి పైగా ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకువస్తుంది.
అలానే పర్సులో చాలా మంది పాత బిల్లులు కాగితాలు వంటివి పెడుతూ ఉంటారు ఇది కూడా అసలు మంచిది కాదు. పనికిరాని వాటిని పర్సులో ఉంచడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది దీనితో ధన నష్టం వంటి సమస్యలు కలుగుతాయి.
అలానే పాన్ మసాలా వంటివి పర్సులో పెట్టుకోవడం మంచిది కాదు. పర్సులో ఆహార పదార్థాలని ఉంచకండి. పర్సులో చాక్లెట్లు, ఆహార పదార్థాలు పెట్టడం వలన కూడా ధన నష్టం కలుగుతుంది.
అలానే పర్సులో మందులు వంటివి కూడా పెట్టకూడదు. ఇవి కూడా నెగటివ్ ఎనర్జీ ని కలిగిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి కాబట్టి ఇటువంటి వాటిని పర్సు లో ఉంచుకోకండి అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version