బిగ్ బాస్ 3 విన్నర్, పాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రలలో సంచలనంగా మారింది. అతనిపై దాడి ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చర్చనీయంశంగా మారింది. ఒక పబ్ కి తన స్నేహితులతో కలిసి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు యువకులు తన స్నేహితురాలి తో అసభ్యంగా ప్రవర్తించడంతో వాళ్ళు ఇతని తలపై దాడి చేసారు.
బీర్ బాటిల్ తో దాడి చేసారు… ఈ దాడి ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల విచారణలో అతనిపై దాడి చేసింది వికారాబాద్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తమ్ముడు అని తెలిసింది. ఇక అతనిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అతను ఒక ట్వీట్ తెలంగాణా పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ కి చేసాడు.
తనపై ఏ విధంగా దాడి చేసారో ఈ వీడియో చూడాలని, ఏది కరెక్ట్ అనేది ఆలోచించి తనకు న్యాయం చెయ్యాలని అతను కోరాడు. తాను తెలంగాణా గడ్డ మీద పుట్టా అని తాను తెరాస పార్టీకి ఓటు వేసా అని అతను ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆయనకు ట్యాగ్ చేస్తూ ఈ వీడియో చేసాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి దీనిపై మంత్రి కేటిఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.
CCTV footage of the incident, how this gang has provoked & attacked me.
please see it for yourself & stand for what is right!@KTRTRS sir, I always stood for TRS party & I vote for TRS alone because I am born on this land & I will serve Telangana as long as I live.#ineedjustice pic.twitter.com/8LQ3PGEBwe— Rahul Sipligunj (@Rahulsipligunj) March 6, 2020