పది నెలల పాపకు రైల్వేలో ఉద్యోగం..అసలు మ్యాటర్ ఇదే..!

-

పది నెలల పాపకు రైల్వేలో ఉద్యోగం ఎలా వస్తుంది అని ఆశ్చర్య పోతున్నారా?..ఇందుకు బలమైన కారణం ఉంది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్పూర్ రైల్వే డివిజన్ కార్మిక విభాగంలో ఓ 10 నెలల పసిపాప నియామకం కోసం రిజిస్ట్రేషన్ పూర్తిచేసింది. ఇంత చిన్న వయసున్న పిల్లల నియామకానికి రిజిస్ట్రేషన్ జరగడం రాయ్పూర్ డివిజన్ చరిత్రలో ఇదే తొలిసారి.

నిజానికి ఈ అమ్మాయి తండ్రి రాజేంద్ర కుమార్.. ఛత్తీస్గఢ్ భిలాయ్లోని పీపీ యార్డ్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఐతే ఆయన జూన్ 1న మందిర్ హసౌద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజేంద్రకుమార్, ఆయన భార్య, కూతురు బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది..

ఆ ప్రమాదంలో పిల్ల తల్లి,దండ్రులు ఇద్దరు చనిపొయారు.రాయ్‌పూర్ రైల్వే డివిజన్ అధికారులు రాజేంద్ర కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇటీవల రాజేంద్రకుమార్ స్థానంలో ఆయన కూతురి కారుణ్య నియమకానికి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. కారుణ్య నియామకాల నమోదు ప్రక్రియ కోసం ఇటీవల రైల్వే అధికారులు బాలిక ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె తన అత్తామామలు, తాతతో నివసిస్తోంది. ఆమె పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇస్తామని అధికారులు వారికి వివరించారు..

పాపకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తామే స్వయంగా వచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్పారు.ఆ పది నెలల పాప వేలి ముద్ర వేయడం కూడా కష్టంగా మారిందని.. పాప కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైల్వేలో ఉద్యోగం కన్ఫర్మ్ చేసినట్లు వెల్లడించారు. మెజారిటీ వచ్చిన తర్వాత ఆ బాలిక.. రైల్వే విధుల్లో చేరుతుంది. డ్యూటీలో చేరిన అనంతరం… ఆమెకు ఇతర సిబ్బందిలాగే జీతం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. చిన్నారికి రైల్వేలో ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు..మొత్తానికి ఈ వార్త చక్కర్లు కోడుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version