హైదరాబాద్‌ విషాదం.. రైల్వే ట్రాక్‌లపై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా

-

రైల్వే ట్రాక్‌లపై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా ఓ విద్యార్థి రైలు ఢీకొని మృతి చెందాడు. సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మే 5వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మహ్మద్ సర్ఫరాజ్ అనే విద్యార్ధి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. ట్రాక్ వెంట తన ఇద్దరు మిత్రులతో వీడియోలు తీస్తున్న సమయంలో ఆ విద్యార్థిని వెనుక వైపు నుండి రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు సర్ఫరాజ్. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు శ్రీరామ్ నగర్ లోని రహ్మత్ నగర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. వారి ఫోన్ కూడా స్పాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుమ్మల తలుపూరు ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధాకర్.. విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై వెళ్తుండగా సైదాపురం మండలం తుమ్మలతలుపూరు మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో సుధాకర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం పొదలకూరుకు తరలించారు. అయితే మార్గ మధ్యలో సుధాకర్ మృతి చెందాడు. మృతుడిది నెల్లూరు రూరల్ మండలం చెముడుగుంటగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version