ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ/నైరుతి దిశల నుండి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ సూచనలు చేసింది.
వర్షసూచన ;
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.