ఏపీలో పలు జిల్లాల్లో లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం రోజు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ లోని కోస్తా… రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ రోజు నుండి ఈనెల 30వ తేదీ వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కడప జిల్లాలో అదేవిధంగా రేపు ఎల్లుండి విశాఖ, ఉభయగోదావరి కృష్ణా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసాయి. వర్షాకాలం పూర్తయి చలికాలం ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ వర్షాల ప్రభావం తగ్గడం లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలి ప్రభావం కూడా పెరిగిపోయింది.