తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

-

తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి వర్షాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ రోజు ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ రోజు తెలంగాణాలోని నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ… రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ రోజు రేపు, ఎల్లుండి తెలంగాణలో ఒకటి, రెండు ప్రదేశాల్లో మరియు చాలా జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు వున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news