వెదర్‌ అప్డేట్‌: తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

-

తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ చిరు జల్లులు మాత్రమే కురుస్తాయి. దట్టమైన మేఘాలు లేవు. ఉన్న మేఘాలు కరిగిపోయాయి. అయితే.. తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం ఉంటుందని, మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ పేర్కొంది.

ఈ నెల 25 నుంచి 28 వరకు మూడురోజుల పాటు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం చెప్పింది. అయితే, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. గురువారం గురువారం ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్‌ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్‌ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్‌మ్యాన్‌ వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version