పడక సుఖం కోసం పెళ్లన్నాడు.. అవసరం తీరాక..

-

కామంతో కళ్లుమూసుకుపోయి.. అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. పడక సుఖం కోసం పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకుంటున్నారు. తీరా శారీరక వాంఛ తీరాక ముఖం చాటేస్తున్నారు. ఎదురుతిరిగితే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మోసం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన బాధితురాలు గతంలో నిమ్స్ ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యను పూర్తి చేసి క్లీనికల్ ఫార్మాకాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెన్స్ వైద్యురాలిగా విధులు నిర్వహించింది.

ఆ సమయంలో హాస్టల్లో ఉండే బాధితురాలికి గ్యాస్ట్రో సర్జరీ డిపార్ట్మెంట్ వైద్యుడు డాక్టర్ సౌరవ్ చౌదరితో పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకే హాస్టల్లో సుమారు 6 నెలలు సహజీవనం చేశారు. 2022లో సౌరవ్ చౌదరి వైద్య వృత్తి నిమిత్తం కోల్ కత్తాకు వెళ్లిపోయాడు. బాధిత వైద్యురాలు కూడా కేరళలో ఉంటుంది. ప్రస్తుతం సౌరవ్ కు ఫోన్ చేస్తే స్పందన లేదని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version