Breaking : తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

-

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, తీరాల వెంబడి ఆవర్తనం ఏర్పడుతుందని చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా పశ్చిమ, నైరుతి వాయుగుండం ఎక్కువగా ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సినాప్టిక్ పరిస్థితి సూచిస్తుంది చెప్పారు.

రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితుల్లో ప్లస్ లేదా మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని డాక్టర్ నాగరత్న తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, రిర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనల దృష్ట్యా రెస్క్యూ, రిలీఫ్ చర్యలను సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూలైలో అధికారులను కోరారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర పరిపాలనకు ఇది పరీక్షా సమయమని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version