రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అయితే.. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని తెలిపింది.